'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
MDK: ఫేక్ ట్రేడింగ్, ఫేక్ IPOలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. రోజురోజుకీ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.