నెల్లిమర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: నెల్లిమర్ల సబ్ స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం పట్టణంతో పాటు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE త్రినాధరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సబ్ స్టేషన్ పరిధిలోని పట్టణానికి, అన్ని తాగునీటి పథకాలకు ఉదయం 10 నుంచి 4 వరకు సరఫరా నిలిచిపోతుందన్నారు. అలుగోలు ఫీడర్ పరిధిలోని గ్రామాలకు కూడా సరఫరా ఉండదన్నారు.