ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం
బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జన్ సూరజ్ పార్టీ అభివృద్ధి కోసం ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపాదనలో 90 శాతం ఆదాయాన్ని పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎన్నికలకు ముందు రూ.10 వేలు అందుకున్న వారిని కలిసేందుకు.. JAN 15 నుంచి ప్రతి ఇంటికి వెళ్తానని తెలిపారు. వారికి రూ.2 లక్షలు అందేలా చేస్తామన్నారు.