ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్
NZB: జిల్లాలోని వినాయకనగర్ ఉన్న ఈవీఎం గోడౌను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగ పర్యవేక్షకుడు ధన్వాల్ ఉన్నారు.