వేములవాడ రాజన్న సేవలో సినీనటుడు సత్యం రాజేష్

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని శనివారం సినీ నటుడు సత్యం రాజేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.