ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన AITUC

ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన AITUC

WGL: నర్సంపేట బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బుధవారం AITUC సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా AITUC నాయకుడు ముక్తిశ్వర్ మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో AITUC ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు.