వందే భారత్ స్లీపర్ అద్భుతం.. 180 km/h స్పీడ్‌తో రికార్డు

వందే భారత్ స్లీపర్ అద్భుతం.. 180 km/h స్పీడ్‌తో రికార్డు

భారత రైల్వేలు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్‌లో అద్భుతం చేసింది. సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా మార్గంలో జరిగిన ఈ పరీక్షలో.. రైలు గంటకు 180 km/h గరిష్ట వేగాన్ని విజయవంతంగా సాధించింది. ఇది భారతీయ రైల్వేల ఆధునికీకరణలో కీలక మైలురాయి అని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల దూర ప్రయాణాలను ఈ రైలు మరింత వేగవంతం చేయనుంది.