నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరణ

నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరణ

విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధా సాగర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకముందు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో పని చేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇంతవరకు ఇంఛార్జ్ ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న డి. వెంకటేశ్వరరావు నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనకు సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.