గుంటూరులో మహిళలకు ఉచిత శిక్షణ
గుంటూరు: కొత్తపేటలోని యూనియన్ ఆర్సెటిలో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 11న బ్యూటీ పార్లర్, 22న టైలరింగ్ కోర్సులు ప్రారంభమవుతాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల గ్రామీణ మహిళలు అర్హులు. వయసు 19-50 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు రేషన్, ఆధార్, టెన్త్ సర్టిఫికెట్లతో కొత్తపేటలోని సంస్థలో సంప్రదించాలి.