ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
AKP: జిల్లాలో ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం జీవో ప్రకారం కనీస వేతనం అములు చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి DCH శ్రీనివాసరావు, సూపరడెంట్ కృష్ణ రావుకు వినతిపత్రం సమర్పించారు.