'ఇంటర్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'
కడప: ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.