యూరియా కోసం రైతుల రాస్తారోకో

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ ప్రాంతంలో యూరియా కోసం కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై రైతులు గురువారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూస్తున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి యూరియా సరఫరా చేయాలన్నారు.