VIDEO: దెబ్బతిన్న రోడ్డుతో అవస్థలు
ప్రకాశం: పొదిలి నుంచి కొండపికి వెళ్లే వాహనదారులు దెబ్బతిన్న రోడ్డుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడుగడుగునా గుంతలమయం కావడంతో కొండపికి వెళ్లే వాహనదారులు అవస్థలు పడుతూ సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.