VIDEO: DEO కార్యాలయం ముట్టడి
ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఏఐటియూసి ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జంపాల రవీందర్ హాజరై మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, వేతనాలు మంజూరి చేయాలని, ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం రూ. 10 వేలు వేతనం అందించాలని డిమాండ్ చేశారు.