రేవంత్ పాలనపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
MDK: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా కేంద్రంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆయన ఆరోపించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న తమను అడ్డుకుని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.