డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల

HNK: ఆర్ట్స్ అండ్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీ (అటానమస్) బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండో, ఐదో బ్యాక్ లాగ్ డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 1,014 మంది విద్యార్థులు హాజరు కాగా 355 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకులు పాల్గొన్నారు.