'ఆన్‌లైన్ ద్వారా నగదు జమ చేయాలి'
ASR: జిల్లాలో లబ్ధిదారులందరికీ రేషన్ పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో సిబ్బందిని నియమించి, ధాన్యం సేకరణ చేపట్టేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం సేకరణ చేపట్టిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు.