VIDEO: వృద్ధుడిని కాపాడిన పోలీసులు

VIDEO: వృద్ధుడిని కాపాడిన పోలీసులు

కోనసీమ: ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన కుంపట్ల సత్యనారాయణ ఆలమూరు మండలం జొన్నాడ గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అటుగా వెళ్తున్న DSP ప్రదీప్తి గమనించి ఆలమూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆలమూరు ఎస్సై తన సిబ్బందితో కలిసి జాలర్ల సహాయంతో పడవపై వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న కుంపట్ల సత్యనారాయణను కాపాడారు.