తీరనున్న యూరియా సమస్య: ఎమ్మెల్యే

MBNR: గత కొంతకాలంగా జడ్చర్ల నియోజకవర్గంలో నెలకొన్న యూరియా సమస్య తీరనున్నట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపిని ఎమ్మెల్యే ఆదివారం కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న యూరియా సమస్య గురించి కమిషనర్‌కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి రేపటి వరకు యూరియాను అందిస్తామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.