గోపూజ నిర్వహించిన చీరాల ఎమ్మెల్యే

ప్రకాశం: అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే మాలకొండయ్య ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకొని చీరాలలో నిర్వహించిన పారువేట కార్యక్రమంలో మద్దులూరి పాల్గొని అమ్మవారి నగరోత్సవ ప్రతిమలను దర్శించుకున్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.