IND vs SA: నేటి నుంచి రెండో టెస్టు
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ దూరం కావడంతో, ఈ మ్యాచ్‌కు టీమిండియా సారథిగా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది.