'త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యం'
కోనసీమ: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అల్లవరం మండలంలోని ఎంట్రీకోన గ్రామంలో నూతనంగా నిర్మించిన సురక్షిత త్రాగునీటి ట్యాంకర్‌ను ఆయన ప్రారంభించారు. స్థానిక మహిళలకు నూతన కుళాయిల ద్వారా మంచినీటిని పట్టి అందజేశారు.