‘నిజాం నడ్డి విరిచి, హైదరాబాద్‌ను కలిపారు’

‘నిజాం నడ్డి విరిచి, హైదరాబాద్‌ను కలిపారు’

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పటేల్‌ను ఉక్కుమనిషి, దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తానన్న నిజాం నడ్డి విరిచి, 'ఆపరేషన్ పోలో' ద్వారా భారత్‌లో కలిపిన ఘనత పటేల్‌దే అని వివరించారు.దేశ ఐక్యతే పటేల్‌కు మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం అని వెంకయ్య అన్నారు.