కొమరాడ మండలంలో పర్యటించిన సబ్ కలెక్టర్

పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్ వైశాలి కొమరాడ మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. మాదలంగి దగ్గర్లో గల గుమ్మిడి గెడ్డను పరిశీలించారు. గుమ్మిడిగెడ్డ మీదుగా నీటి ప్రవాహంను పరిశీలించారు. ప్రజలు ఎవరునీటి ప్రవాహం గుండాదాటకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గుమ్మిడిగెడ్డకు ఇరు వైపులా ఎవరు దాటకుండా తాడును ఏర్పాటు చేశామని స్థానిక అధికారులు తెలిపారు.