'ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి'

'ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి'

GNTR: మంగళగిరి రూరల్ పరిధిలో ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి అని ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్, ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారన్నారు. ఈ సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు సర్కిల్ ఆఫీసులో నమోదు మొదలవుతుందన్నారు.