కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన మంత్రి

కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన మంత్రి

ప్రకాశం: కొండపి మండలం గుర్రపడిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం పరిశీలించారు. స్లాబ్ పనులు పూర్తయినట్లు గుర్తించిన ఆయన, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్సీ కాలనీలో జరుగుతున్న సైడ్ కాలువల పనులను తనిఖీ చేశారు.