ఆకివీడులో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఆకివీడులో పొట్టి శ్రీరాములు వర్ధంతి

W.G: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆకివీడులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, పట్టణ తెదేపా అధ్యక్షుడు గంధం ఉమా, తదితరులు పాల్గొన్నారు.