మున్సిపల్ ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి: కలెక్టర్
WGL: వర్ధన్నపేటలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం వర్ధన్నపేట రైతు వేదికలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసి ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలన్నారు.