సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఏకగ్రీవం!
SDPT: అక్కన్నపేట మండలం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటైన శ్రీరామ్ తండాకు బానోతు వెంకటేష్ సర్పంచ్ తండావాసులంతా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మారుమూల తండాలో యువకుడిగా ఎంతో కష్టపడి తండాల అభివృద్ధి కోసం పాటుపడిన వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అలాగే 8 మందిని వార్డు సభ్యుల ఎన్నిక చేపట్టారు. అనంతరం తండావాసులు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.