టీడీపీ నేత కుటుంబానికి అండగా సీఎం సతీమణి
కుప్పం నియోజకవర్గం గుండిశెట్టిపల్లికి చెందిన ఐటీడీపీ నేత రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, నారా భువనేశ్వరి గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె.. చిన్న వయసులో ఆయన మరణం బాధాకరమన్నారు. రవి భార్యకు, కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలన్నారు.