క్రికెటర్‌గా మారిన అనంతపురం ఎమ్మెల్యే

అనంతపురం: విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన క్రీడ పోటీల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, ప్రజా ప్రతినిధులు మధ్య ఐకత్యను పెంపొందించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు ఈ క్రీడాలను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు.