చారిత్రక వారసత్వంగా 'మన ఫణిగిరి'

చారిత్రక వారసత్వంగా 'మన ఫణిగిరి'

SRPT: జిల్లాలోని ఫణిగిరి ఒక అద్భుతమైన బౌద్ధ పురావస్తు క్షేత్రం. ఈ కొండ పడగ ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ క్రీ.పూ నాటి భారీ స్తూపం, విహారాలు, బుద్ధుని పాదముద్రలు, అరుదైన శిల్పాలు ఉన్నాయి. శాతవాహన, ఇక్ష్వాకుల కాలం నాటి ఈ కట్టడాలు బౌద్ధ సంస్కృతికి నిదర్శనం. చరిత్ర ప్రేమికులకు, పర్యాటకులకు ఒక గొప్ప సందర్శనీయ స్థలం. ఇక్కడి కళాఖండాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.