భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

కోనసీమ: రాయవరం మండలం పసలపూడి లో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఇవాళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పరిటాల శ్రీనివాస్, కేదార్ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అభిషేకాలు, అర్చనలు అనంతరం మంత్రి సుభాష్ ఆశీర్వచనం పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.