తెనాలిలో కాల్వలో కనిపించిన ‘ఆవు’ అసలు కథ
GNTR: తెనాలి మారీసుపేట దిగువ వంతెన వద్ద కాల్వలో ఆవు పడిపోయిందన్న ప్రచారం మంగళవారం స్థానికులను కలవరపరిచింది. కదలకుండా పడి ఉండటం చూసి పలువురు జాలిగ చూపినా, దగ్గరకు వెళ్లి చూడగా అది ఓ ఫైబర్ ఆవు విగ్రహమని గుర్తించి ఆశ్చర్యపోయారు. సమీపంలో విగ్రహాల తయారీ చేసే వారు పాడైన విగ్రహాన్ని అక్కడ పడేశారని భావిస్తున్నారు.