వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మంత్రి

AKP: శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నక్కపల్లిలో(M) సారిపల్లిపాలెంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనిత హజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళామణుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అష్టోత్తర శతనామాలతో పూజ జరిగింది. ప్రజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.