VIDEO: మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి MLA భూమి పూజ
KMR: చిన్నమల్లారెడ్డి బాణాల మున్నూరు కాపు సంఘ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘ సభ్యులు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. కుల సంఘాలు దినదినాభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో తన సొంత నిధులు సమకూర్చుతున్నట్లు తెలిపారు.