'నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలి'

'నూతన విద్యా విధానాన్ని నిలిపివేయాలి'

KMM: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలు ఏర్పాటు చేసి, నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదళ్లలో మతతత్వ బీజాలు నాటే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు.