'స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి'
HNK: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ లైబ్రరీ ఎదుట జేఏసీ నేతలు నిరసన చేపట్టారు. కేయూ జేఏసీ అధ్యక్షులు డి.తిరుపతి మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీలోకి వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులను దిగుమతి చేసుకోకుండా ఉమ్మడి జిల్లాలోని స్థానిక నిరుద్యోగ యువకులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని కాజీపేటను అభివృద్ధి చేయాలన్నారు.