VIDEO: ఎక్సైజ్ స్టేషన్‌పై మహిళల దాడి

VIDEO: ఎక్సైజ్ స్టేషన్‌పై మహిళల దాడి

ELR: చింతలపూడి పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణములో కొందరు మహిళలు బుధవారం దాడి చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఎక్సైజ్ కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారికి చెందిన మహిళలు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. మహిళలు చేసిన దాడిలో ఫైబర్ కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.