భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న లోకేష్

భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న లోకేష్

GNTR: మంగళగిరి సగర భగీరథ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధా రోడ్డులో నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గౌతమ్ బుద్ధా రోడ్డులోని శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.