గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా

పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ కొరతపై ఆందోళన నెలకొన్న వేళ రాజస్థాన్‌లోని కిషన్ గఢ్ టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. 145 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ టైర్ పేలి బోల్తా పడింది. సిలిండర్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి పేలుడు సంభవించలేదు. పోలీసులు వెంటనే స్పందించి సిలిండర్లను తొలగించారు.