ప్రపంచ దేశాలకు మోదీ శాంతి పిలుపు

ప్రపంచ దేశాలకు మోదీ శాంతి పిలుపు

'ఏ సమస్యకైనా సైనిక ఘర్షణలు పరిష్కారం కావు' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. యుద్ధం వల్ల వినాశనం తప్ప ఏమీ ఉండదని పేర్కొన్నారు. సమస్యలను దౌత్యమార్గంలో, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మానవాళి సంక్షేమం కోసం శాంతి అత్యవసరమని మోదీ ఉద్ఘాటించారు.