'పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గౌరవం కల్పిస్తాం'

WGL: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కేఆర్ దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ పరిశీలకుడు అమర్ అలీఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నర్సంపేట నియోజకవర్గం నేతలతో పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్ట కాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారికి తగిన గౌరవం కల్పిస్తామని తెలిపారు.