నగరంలో పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్

CTR: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డు గాంధీనగర్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌తో పాటు నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ఉన్నారు. పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది అని అధికారులు తెలిపారు.