పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్
SRPT: మున్సిపాలిటీ 21, 23 వార్డుల్లో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ పనులను పరిశీలించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే చోటికి మార్చాలని స్థానికులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.