లారీ, కారు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

లారీ, కారు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

E.G: జిల్లాలో రాజానగరం వద్ద జాతీయ రహదారిపై ఏడీబీ కూడలి వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటన నెలకొంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను GSL ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన డ్రైవర్‌ సహా ఏడుగురు కారులో విశాఖ నుంచి వాడపల్లికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.