జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు ఉన్నారు.