'ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని ప్రారంభించండి'
SRCL: ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్లలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్ర భవనం రెండేళ్ల క్రితమే పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారింది. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.