అమెజాన్ ఎయిర్ కార్గో విమానం ప్రారంభం
ఢిల్లీ నుంచి గౌహతికి అమెజాన్ ఎయిర్ కార్గో విమానం ప్రారంభమైంది. ఈ సర్వీసును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈశాన్యానికి ఎయిర్ కార్గో కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. ఆయా రాష్ట్రాల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని సంతోషం వ్యక్తం చేశారు. పంటలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేర్చవచ్చని చెప్పారు.