పంచాయతీ కార్యదర్శి లేక గ్రామస్థులు ఇబ్బందులు

పంచాయతీ కార్యదర్శి లేక గ్రామస్థులు ఇబ్బందులు

కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో నెల రోజులుగా పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో పారిశుధ్యం, విద్యుత్ పర్యవేక్షణ లోపించి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లకు నాయకత్వం లేక సమస్యలు తలెత్తుతున్నాయి. దోమల వల్ల వ్యాధులు పెరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే కార్యదర్శిని నియమించాలని కోరుతున్నారు.